ఈనెల 21న మహాకవి గురజాడ అప్పారావు 158వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించే ఈ ఉత్సవం విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సత్య లాడ్జి సమీపంలోని గురజాడ కాంస్య విగ్రహం వరకూ ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. అక్కడ మహాకవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని.. అనంతరం దేశభక్తి గేయాలాపన జరుగుతుందన్నారు. ప్రముఖులు తమ సందేశాలను వినిపిస్తారని తెలిపారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి ఈ వేడుకల్లో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
ఇవీ చదవండి..