విజయనగరం జిల్లా పార్వతీపురంలో మహాకవి గురజాడ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారిలోని గురజాడ విగ్రహానికి సాహితీ సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ మార్పు కోసం గురజాడ తన రచనల ద్వారా చేసిన కృషిని వక్తలు కొనియాడారు. గురజాడ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ రచయిత జీ. గౌర్ నాయుడు. హిందీ కళాశాల వ్యవస్థాపకులు ఎన్. శ్రీరాములు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి..