రక్తహీనతతో గ్రామవాలంటీరు మృతి - విజయనగరంలో గ్రామ వాలంటీర్ మృతి
విజయనగరం జిల్లాలో రక్తహీనతతో బాధపడుతూ ఓ యువతి మృతిచెందింది. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన కుంబురుక పుష్ప (20) గ్రామ వాలంటీరుగా విధులు నిర్వహిస్తోంది. ఆమె రక్తహీనతతో బాధపడుతుండటంతో... తల్లిదండ్రులు వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. పుష్ప మృతితో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

రక్తహీనతతో గ్రామవాలంటీరు మృతి
ఇదీ చదవండి: గుమ్మలక్ష్మీపురంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య