దేవదాయశాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంలో రామచంద్ర మోహన్‌పై ఎండోమెంట్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. భూముల విక్రయం, రికార్డుల నుంచి భూములను తొలగించిన వ్యవహారంలో ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. విచారణ సమయంలో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సింహాచలం ఆలయ అసిస్టెంట్ ఈవోపై చర్యలు..
సింహాచలం ఆలయ అసిస్టెంట్ ఈవో సుజాత విధుల నుంచి తొలగిస్తున్నట్లు దేవాదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. సింహాచల దేవస్థానానికి చెందిన భూ వ్యవహారంలో ఆమెపై చర్యలు తీసుకున్నారు. దేవస్థానానికి రూ.74 కోట్ల నష్టం కలిగించారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈవో సుజాతపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి:
murder: సోదరిని ప్రేమించవద్దన్నందుకు అన్న హత్య..2నెలల తర్వాత వెలుగులోకి