విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒడిశాలోని కిరండోలు నుంచి విశాఖకు ఇనుప ఖనిజాన్ని తరలిస్తోన్న గూడ్స్ రైలు బొడ్డవర రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనతో ఆ మార్గంలో నడిచే పలు ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది. కిరండోలు గూడ్స్ పట్టాలు తప్పటం వలన.. విశాఖ-కిరండోలు ప్యాసింజర్ రైలును కొత్తవలస రైల్వేస్టేషన్ నుంచి వెనక్కి మళ్లించారు. రైల్వే అధికారులు గూడ్స్ రైలును తిరిగి పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేపట్టారు.
ఇవీ చూడండి : జగన్ కాన్వాయిని అడ్డుకున్న మహిళ