విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెలసిన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి 22వ జాతర మహోత్సవ కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతరలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 400 మంది పోలీసు భద్రత సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. వికలాంగులకు, బాలింతలకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం జాతర ఏర్పాట్లు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగిందంటూ ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పిలి సూరి ప్రకాష్ అన్నారు. ముఖ్యంగా బాహుబలి ప్రత్యేక ఆకర్షణగా నిలస్తుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు, సోమవారం సాయంత్రం ప్రముఖ సింగర్ మంగ్లీ చేత గీతాలాపన కార్యక్రమం ఉంటుందన్నారు. మంగళవారం ప్రత్యేక నాటకాలు, భారీ మందుగుండు సామగ్రి కార్యక్రమం ఉంటుందన్నారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి :