AP Corporations Chairpersons Meet CM Chandrababu: కొత్తగా ఎంపికైన కార్పోరేషన్ ఛైర్మన్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడా అహంకారం కనిపించకూడదు, ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులు అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ప్రజల కంటే ప్రత్యేకమని ఎక్కడా భావించోద్దని హితవు పలికారు. ముందుగా చెప్పినట్లు మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చామన్నారు. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించామన్న సీఎం, నేడు నామినేటెడ్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించామన్నారు.
ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగామని, ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయన్నారు. కొందరు నాయకులు తొందర పడుతున్నారని, ఇది మంచి పద్దతి కాదని తెలిపారు. పార్టీ టిక్కెట్ ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంత వరకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు. జైలుకు వెళ్లిన వాళ్లు, ఆస్తులు కోల్పొయిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లు ఉన్నారని, ప్రతి ఒక్కరికీ న్యాయం చెయ్యాలి అనే విషయంలో స్పష్టంగా ఉన్నామన్నారు.
కార్పొరేషన్ పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం - పూర్తి లిస్ట్ ఇదే - CORPORATION POSTS FILLED
కష్టపడిన ఏ ఒక్కరినీ విస్మరించమని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించామని, జనాభా దామాషా లెక్కన బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. పెట్టుబడుల రాబడట్టడంలో, పరిశ్రమల ఏర్పాటు చేయడంలో ఏపీఐఐసీ పాత్ర కీలకమని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావచ్చన్నారు. గత టీడీపీ హయాంలో పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు వాటిని కేటాయించి లక్ష్యం నెరవేరకుండా చేసిందన్నారు. పరిశ్రమలు వస్తే ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని, కానీ జగన్ ఇళ్ల స్థలాల పేరుతో వాటిని ఇచ్చాడని ధ్వజమెత్తారు.
నేతలకే కాదని, ట్రాక్ రికార్డుల ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కూడా కార్పొరేషన్లలో అవకాశాలు ఇచ్చామన్నారు. 'సింపుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్' అని తాను, పవన్ కల్యాణ్ చెప్పామని, అదే అంతా పాటించాలని సూచించారు. 15 రోజుల్లో వరద సాయం అందించామని, మళ్లీ బాధితులను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు. ఇది మన విధానమని, దీనికి అనుగుణంగా మీరు పని చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి, సమన్వయంతో మీరంతా పని చేయాలని కోరారు. మీ వల్ల కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలని స్పష్టం చేశారు.
Corporations Chairmans Thanks to CM Chandrababu: సామాజిక న్యాయం చేసేలా అన్ని వర్గాలకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేటెడ్ పదవులు ఇచ్చారని ఆయా సంస్థల ఛైర్మన్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో నామినేటెడ్ ఛైర్మన్ల పాత్ర ఏమిటో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారని, ఇచ్చిన శాఖకు న్యాయం చేసేలా వ్యవహరిస్తామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్దేశించారని వికసిత్ ఏపీ 2047 సాధనకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
నామినేటెడ్ పదవుల నజరానా - అంకితభావం, విధేయతలకు పెద్దపీట - AP Nominated Posts 2024