ETV Bharat / state

ఈ విద్యా సంవత్సరం నుంచే గరివిడి పశువైద్య కళాశాలలో ప్రవేశాలు..!

రాష్ట్రంలో మరో పశువైద్య కళాశాల అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లా గరివిడిలో నూతంగా నిర్మించిన పశువైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పించనున్నారు. జనవరి మొదటి వారంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కళాశాలను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్ అనంతరం జనవరి రెండో వారంలో తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు.

Garividi veterinary college
Garividi veterinary college
author img

By

Published : Dec 17, 2020, 7:57 PM IST

విజయనగరం జిల్లా గరివిడిలో నూతనంగా నిర్మించిన పశువైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పించనున్నట్లు ఎస్వీవీయూ వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఈ పశువైద్య కళాశాల నడుస్తోంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ముగియగానే జనవరి రెండో వారంలో పశువైద్య విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయని, జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా కళాశాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని పద్మనాభరెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి కార్యాలయం ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేయగానే వర్చువల్‌ విధానంలో కళాశాలను ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, కృష్ణాజిల్లా గన్నవరం, కడప జిల్లా ప్రొద్దుటూరులో పశువైద్య కళాశాలలు ఉండగా.. 2020-21 విద్యాసంవత్సరం నుంచి విజయనగరం జిల్లా గరివిడిలో నూతన పశువైద్య కళాశాల అందుబాటులోకి రానుంది.

2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.91.25 కోట్ల నాబార్డు నిధులతో కళాశాల నిర్మాణం ప్రారంభించింది. భారత పశువైద్య మండలి (వీసీఐ) బృందం పరిశీలన అనంతరం ప్రవేశాలకు అనుమతి లభించింది. భారత పశువైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా ఒక్కో కళాశాలలో 82 పశువైద్య(బి.వీఎస్సీ) సీట్లు భర్తీ చేస్తారు. అందులో ఎంసెట్‌ ద్వారా 85 శాతం సీట్లు, నీట్‌ ర్యాంకుల ఆధారంగా భారత పశువైద్య మండలి కోటాలో 15 శాతం సీట్లు భర్తీ చేస్తారు.

ఇదీ చదవండి : అమరావతి జనభేరి..అన్ని పార్టీలదీ ఒక్కటే గళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.