అగ్నిప్రమాదాలు జరిగినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఫైర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వాస్పత్రి వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. అగ్నిమాపక అధికారి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... ఆస్పత్రిలో మంటలు వ్యాపించినప్పుడు రోగులను ఏ విధంగా బయటకు తీసుకురావాలి.. ప్రాణనష్టం లేకుండా చేపట్టాల్సిన చర్యలేంటో వివరించారు. మంటలను అదుపుచేసే పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు.
ఇది కూడా చదవండి.