భోగాపురం జాతీయ రహదారి సుందరి పేట కూడలిలో ఆగి ఉన్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో వాడేసిన బ్యాటరీలు ఉన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని హైవే మొబైల్ వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్లే రహదారిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాసేపు, ట్రాఫిక్ అంతరాయం జరిగింది. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన మంటలు ఆర్పివేశారు.
ఇదీ చూడండి