ETV Bharat / state

టమాటా రైతు కష్టాలు.. గిట్టుబాటు కాక తీవ్ర నష్టాలు

author img

By

Published : Mar 24, 2021, 6:10 PM IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. దిగుబడులను విక్రయించేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి పరిస్థితి తప్పడం లేదు. ఈ పరిస్థితితో.. టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో టమాటా రైతులు పెట్టిన పెట్టుబడి రాక.. సకాలంలో సరుకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

farmers worryed about tamato rates
కూలి డబ్బులు కూడా కిట్టడం లేదని టమాట రైతు ఆవేదన

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో 250 హెక్టర్లలో టమాట సాగు చేశారు. వారంతా.. దిగుబడికి తగిన ధర రాక.. పెట్టుబడి సైతం తిరిగి అందక ఇబ్బంది పడుతున్నారు. గంటల పాటు మార్కెట్ లో నిరీక్షిస్తున్నా పంట మాత్రం అమ్ముడు కాని పరిస్థితి సైతం ఎదుర్కొంటున్నారు.

25 కిలోల టమాట ట్రే 100 రూపాయలు మాత్రమే పలుకుతున్న పరిస్థితుల్లో.. పెట్టిన మదుపులు రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. పలు గ్రామాల రైతులు పట్టణ ప్రాంతాలకు సరకు తీసుకెళ్లి కష్టపడి విక్రయిస్తున్నా.. కూలీ డబ్బులు సైతం గిట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:

మహిళల హక్కులు, చట్టాల గురించి తెలిపే బ్రౌచర్​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.