ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులకు అవస్థలు మొదలయ్యాయి. ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వ్యవసాయ సబ్ డివిజన్లో 25 వేల హెక్టార్లలో వరి పంట సాగు అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 60 శాతం మేర నాట్లు పూర్తయ్యాయి. వీటికి తగ్గ యూరియా రాని కారణంగా.. రైతులకు సమస్య లు ఎదురవుతున్నాయి.
కావలసిన ఎరువులను హబ్‌ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అలాంటి వాతావరణం లేదు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నప్పటికీ అరకొరగానే ఇస్తున్న పరిస్థితుల్లో.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కావలసిన ఎరువులు దొరకటం లేదని రైతులు వాపోతున్నారు. బస్తా యూరియా కోసం సొసైటీల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదంటున్న రైతులు... ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: