ETV Bharat / state

పోలీసుల తీరును నిరసిస్తూ బంద్​కు పిలుపు.. రైతులు, మద్దతుదారుల ముందస్తు అరెస్టులు

చెరకు రైతులపై పోలీసుల దాడికి నిరసనగా రైతు సంఘ నాయకులు ఈరోజు బంద్ చేపట్టారు. అందులో భాగంగానే పోలీసులు ముందస్తు అరెస్టులు(farmers and supporters arrested at Vizianagaram district) చేపడుతున్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వామపక్ష నాయకులు హెచ్చరించారు.

farmer-community-leaders-arrest-due-to-call-on-bandh
నేడు రైతు సంఘాల బంద్.. నాయకుల ముందస్తు అరెస్టులు..
author img

By

Published : Nov 5, 2021, 9:14 AM IST

Updated : Nov 5, 2021, 4:16 PM IST

రైతులు, మద్దతుదారుల ముందస్తు అరెస్టులు

విజయనగరం జిల్లాలో చెరకు రైతులపై పోలీసుల దాడికి నిరసనగా రైతు సంఘ నాయకులు ఈరోజు డివిజన్​ బంద్​కు(vizianagaram district farmers call to bandh) పిలుపునిచ్చారు. బొబ్బిలి, పార్వతీపురం, సీతానగరంలో పోలీసులు పలువురిని ముందస్తుగా అరెస్టు(farmers and supporters arrested at Vizianagaram district) చేశారు. బంద్ దృష్ట్యానే ముందస్తు అరెస్టులు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. జనసేన, సీపీఐ, సీపీఎం నేతలతో పాటు రైతు సంఘ నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కర్మాగారం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ జనసేన నాయకులు లచ్చయ్యపేట కర్మాగారం వద్దకు చేరుకున్నారు. వారిలో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల తీరును వామపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టుల(farmers and supporters arrested at Vizianagaram district)తో ఉద్యమాలు ఆగవన్నారు. కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు ఉన్న యాజమాన్య ప్రతినిధులను అరెస్టు చేయకుండా.. రైతులు, రైతు సంఘాల నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చెరకు బకాయిలపై పోరాడుతున్న రైతుల పట్ల పోలీసుల తీరును సీపీఎం నాయకులు వేణు, సీపీఐ నాయకులు రమణ, ఏఐటీయూసీ నాయకులు గోపాలన్ తదితరులు తీవ్రంగా ఖండించారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిను తక్షమనే యాజమాన్యం చెల్లించాలని, ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు రెడ్డి శంకర్​రావు డిమాండ్ చేశారు. అక్రమ కేసులు ఎత్తి వేయాలని లేకుంటే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సీతానగరం షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. గత రెండు సీజన్లకు సంబంధించి కర్మాగారం పరిధిలోని 2400 మంది రైతులకు యాజమాన్యం రూ.16.38 కోట్లు చెల్లించాల్సి ఉంది.

సంబంధిత కథనాలు:

Farmers Protest: తిరగబడ్డ చెరకు రైతు.. తమపై దాడికి వచ్చిన పోలీసులను తరిమికొట్టి..

Remond: చెరుకు రైతుల ఆందోళనలో అరెస్టైన నేతలకు 14 రోజుల రిమాండ్

Last Updated : Nov 5, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.