విజయనగరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 పోటీలు ముగిశాయి. నగరంలోని విజ్జీ, ఎంఆర్ క్రీడామైదానాల్లో 3 రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. క్రికెట్‌తో పాటు ఖోఖో, కబడ్డీ, చదరంగం, బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో పోటీలు హోరాహోరీగా సాగాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన జట్లు ఇందులో పాల్గొన్నాయి. క్రీడల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందచేశారు. ఓడినవారు అధైర్యపడొద్దని.. ఓటమి గెలుపునకు మొదటి మెట్టని కలెక్టర్ వ్యాఖ్యానించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈనాడు యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ఇవీ చదవండి: