విజయనగరంలోని విజ్జీ క్రీడా మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ టోర్నీ, విజయనగరం జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా సెట్వీజ్ సీఈవో నాగేశ్వరరావు, జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి
ఎమ్ఎల్ఎన్ రాజు, ఈనాడు శ్రీకాకుళం యూనిట్ బాధ్యులు వెంకటరమణ లాంఛనంగా ప్రారంభించారు. క్రికెట్ పోటీలతో పాటు... ఉత్తరాంధ్ర ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్, అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించిన ట్రోఫీలను ఆవిష్కరించారు. అనంతరం క్రికెట్ టోర్నీ మొదటి రోజు పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈనాడు ప్రతియేటా క్రమం తప్పకుండా టోర్నీ నిర్వహించటం అభినందనీయమని ఆహ్వానితులు అన్నారు. ప్రభుత్వపరంగా, జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున కూడా టోర్నీ నిర్వహణకు తగిన సహాయ సహకారాలు అందచేస్తామని సెట్వీజ్ సీఈవో, విజయనగరం జిల్లా క్రికెట్ అసోషియేషన్ కార్యదర్శి తెలియచేశారు.
ఇవీ చదవండి...మూడవ రోజు ఉత్కంఠ భరితంగా...ఈనాడు స్పోర్ట్స్ లీగ్