ETV Bharat / state

రెయిన్ అలర్ట్ : రాష్ట్రానికి వాయు'గండం' - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - RAIN ALERT IN AP

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు - అన్ని పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ

Weather update
Weather update (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2024, 4:47 PM IST

Updated : Dec 20, 2024, 9:36 PM IST

RAIN ALERT IN AP : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది బంగాళాఖాతంలో ఉత్తర దిశగా పయనిస్తూ చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

40-50 కిలోమీటర్ల వేగంతో : అలాగే తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరో రెండ్రోజులు మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని తెలిపారు. కళింగపట్నం-మచిలీపట్నం వరకు అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా మెంటాడలో 6 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వివరించారు. తీవ్ర అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మెఘావృతమైంది. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుముల తో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

అలర్ట్​ - బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తరాంధ్రలో రెండ్రోజులు భారీ వర్షాలు

తడిసి ముద్దవుతోన్న సిక్కోలు : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తోంది. చల్లని గాలులు, వర్షపు జల్లులతో సిక్కోలు తడిసి ముద్దవుతోంది. రెండ్రోజులుగా పట్టిన ముసురు అన్నదాతలను కలవరపరుస్తోంది. ఖరీఫ్ వరి పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో కంచిలిలో అత్యధికంగా 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

విరిగిపడిన కొండ చరియలు : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విశాఖలోని లక్ష్మీ నగర్ కొండమీద ఉన్న ఓ ఇంటి గోడ విరిగిపడింది. అలాగే గోపాలపట్నం నుండి ఎన్ఏడి వరకు ఉన్న ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతాలను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు పరిశీలించారు. గంటకోసారి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తిరుమల ఘాట్​ రోడ్డులో జారిపడ్డ బండరాళ్లు - వాహనదారులకు జాగ్రత్తలు

కొనసాగుతున్న అల్పపీడనం - ధాన్యంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Last Updated : Dec 20, 2024, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.