విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్ఈసీఎస్ పరిధిలో 59ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని పరీక్షలు రాసిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి గత ఏడాది సెప్టెంబరులో విజయనగరం పట్టణంలో సామర్థ్యం పరీక్ష నిర్వహించారని.. వారం రోజుల్లో ఫలితాలు రావాల్సి ఉండగా నేటికి వరకు కూడా రాలేదని డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. లేనిపక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీచూడండి: పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ