కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా.. లాక్డౌన్ ప్రక్రియకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా మద్ధతు లభిస్తోంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు, అధికారుల నిబంధనల నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. గ్రామాల సరిహద్దులను మూసివేస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు మాత్రమే ప్రజలు బయటకి వస్తున్నారు. ఉదయం పది గంటలలోపే కొనుగోళ్లను పూర్తి చేసికొని ఇంటికి చేరుకుంటున్నారు. జిల్లాలో అత్యంత రద్దీ ఉన్న కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లను అధికారులు విశాల ప్రాంతాలకు తరలించారు. విక్రయదారులు, కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. గ్రామ స్థాయిలో.. పూర్తిస్థాయి పర్యవేక్షణ చేసేందుకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
మా ఊర్లోకి రావొద్దు బాబోయ్..!
కరోనా సోకిందన్న డౌట్‌తో బస్సు డ్రైవర్ ఆత్మహత్య