ETV Bharat / state

కరోనాను జయించి విధుల్లో చేరిన పోలీసులకు ఎస్పీ స్వాగతం

author img

By

Published : Jul 14, 2020, 6:10 PM IST

కరోనా చికిత్స పొంది పూర్తిగా కోలుకొని విధుల్లోకి వచ్చిన పోలీస్​ సిబ్బందికి విజయనగరం జిల్లా ఎస్పీ స్వాగతం పలికారు. నెల్లిమర్ల డీటీసీ సెంటర్ నుంచి 32 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వారు పూర్తిగా కోలుకుని విధుల్లోకి వస్తున్నారని ఎస్పీ రాజకుమారి తెలిపారు. అనంతరం వారికి పండ్లు, శానిటైజర్లు అందజేశారు.

dtc police rejoined to work
కరోనాను జయించి విధుల్లోకి చేరిన పోలీసులు

కరోనాను జయించిన నెల్లిమర్ల డీటీసీ సెంటర్ నుంచి 32 మంది పోలీసు సిబ్బంది ఈ రోజు విధి నిర్వహణలో చేరుతున్నారని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. కొవిడ్​ నుంచి కోలుకున్న పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి పండ్లు, శానిటైజర్​లు అందజేశారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరికి కరోనా నిర్ధరణ అయినా వెంటనే డీటీసీ సెంటర్​లో ఉంచడం జరిగిందని ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. కరోనా నిర్ధరణ అయిన తమలో జిల్లా ఎస్పీ ధైర్యాన్ని నింపారని, అలాగే ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి వ్యాధికి చికిత్స చేయించడంలో తోడ్పాటు అందించారని సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి సహకరించిన జిల్లా ఎస్పీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి...

కరోనాపై విజయనగరంలో అవగాహన ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.