ఎనిమిది అడుగుల స్థలంలో వంట కట్టెలు వేయటంపై వివాదం ముదిరింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గొర్లెపేట గ్రామంలో దీనిపై కుల దూషణ కేసు నమోదైంది. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బంగారమ్మ ఖాళీ స్థలంలో వంట కట్టెలు వేశారు. సమీప, సంబంధిత గ్రామస్తులు వాటిని తక్షణమే తీయాలంటూ... కులం పేరుతో దూషించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గ్రామంలో సంబంధిత వ్యక్తులను పోలీసులు విచారించారు. కేసు విచారణకు ప్రత్యేకాధికారిగా డీఎస్పీ మోహన్రావు హాజరై జరిగిన విషయాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సై అశోక్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కుల దూషణ కేసుపై డీఎస్పీ విచారణ
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గొర్లెపేట గ్రామంలో ఎనిమిది అడుగుల స్థలంలో వంట కట్టెలు వేయడంపై వివాదం ముదిరింది. దీనిపై కుల దూషణ కేసు నమోదైంది.
ఎనిమిది అడుగుల స్థలంలో వంట కట్టెలు వేయటంపై వివాదం ముదిరింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గొర్లెపేట గ్రామంలో దీనిపై కుల దూషణ కేసు నమోదైంది. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బంగారమ్మ ఖాళీ స్థలంలో వంట కట్టెలు వేశారు. సమీప, సంబంధిత గ్రామస్తులు వాటిని తక్షణమే తీయాలంటూ... కులం పేరుతో దూషించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గ్రామంలో సంబంధిత వ్యక్తులను పోలీసులు విచారించారు. కేసు విచారణకు ప్రత్యేకాధికారిగా డీఎస్పీ మోహన్రావు హాజరై జరిగిన విషయాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సై అశోక్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబీ సిబ్బంది దాడులు