ETV Bharat / state

గిరిజన విశ్వవిద్యాలయం కోసం ప్రతిపాదిత స్థల పరిశీలన

గిరిజన విశ్వవిద్యాలయం కోసం దుర్గసాగరం కోట్టకి పంచాయతీ పరిధిలో ప్రతిపాదించిన స్థలాన్ని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, కేంద్ర బృందం సభ్యులు, జిల్లాకలెక్టర్ పరిశీలించారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు తర్వాత ల్యాబ్ ఏర్పాటు చేసి పరిశోధన జరిగితే ఇక్కడ గిరిజనులు గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు తెలుస్తాయని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్​చంద్ర వారికి చెప్పారు.

Deputy CM Visit Tribal University proposal Land
గిరిజన విశ్వవిద్యాలయం కోసం ప్రతిపాదించిన స్థలం పరిశీలన
author img

By

Published : Sep 26, 2020, 9:22 PM IST

విజయనగరం జిల్లా సాలూరు, బొబ్బిలి నియోజకవర్గ సరిహద్దు ప్రాంతం దుర్గసాగరం కోట్టకి పంచాయతీ పరిధిలోని గిరిజన విశ్వవిద్యాలయం కోసం స్థలాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాన్ని కేంద్ర బృందం సభ్యులు ప్రొఫెసర్ టీవీ కట్టముని, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్​చంద్ర, జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్, ఐటీడీఏ పీవో కూర్మనాథ్​తో కలిసి డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పరిశీలించారు. కేంద్ర సభ్యులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇంతకుముందు ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో వెయ్యి ఎకరాల భూమి ఉన్నట్లు కేంద్ర బృంద సభ్యులు చెప్పారు.

ప్రస్తుతం 350 ఎకరాలు ఉన్నా మిగతా భూమి సేకరించే అవకాశం ఉందని సతీష్​చంద్ర వారికి వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న గిరిజనులకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుందని, ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత గిరిజనులు ఉన్నత విద్య అభ్యసించే వీలుంటుందని.. ఒడిశాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్ర బృందం సభ్యులు ప్రొఫెసర్ సర్రాజు తెలిపారు. దేశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం పక్కనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతంలో గిరిజనుల భూములు, వారి ఆచార వ్యవహారాలు ఎంతో భిన్నంగా ఉంటాయని.. విశ్వవిద్యాలయం ఏర్పాటు తర్వాత ల్యాబ్ ఏర్పాటు చేసి పరిశోధన జరిగితే ఇక్కడ గిరిజనులు గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు తెలుస్తాయని సతీష్​చంద్ర వారికి వివరించే ప్రయత్నం చేశారు.

ఇదీ చదవండి:

త్వరలో నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.