వ్యవసాయ ప్రయోగశాలల గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన వినూత్నమని.. దేశంలోనే ఇది ప్రథమమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కురుపాంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న వైఎస్సార్ అగ్రిల్యాబ్ భవన నిర్మాణానికి ఆమె శంకుప్థాపన చేశారు. రాష్ట్రంలోని రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందించే లక్ష్యంతోనే వైఎస్సార్ సమీకృత వ్యవసాయ ప్రయోగశాల (ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్)లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా స్థాయి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను, 147 నియోజకవర్గ స్థాయి ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతిలలో రీజనల్ కోడింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ స్థాయి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లను కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోటల్లో ఏర్పాటు చేస్తున్నామని పుష్ప శ్రీవాణి చెప్పారు.
ఇవీ చూడండి:
పూర్వ విద్యార్థుల సాయంతో... ఆస్పత్రిలో మంచి నీటి ప్లాంట్ ఏర్పాటు