ETV Bharat / state

pushpa srivani: 'రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి కృషి' - pushpa srivani attend in world tribal day celebrations at parvathipuram

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆదివాసీ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి (pushpa srivani) పాల్గొన్నారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని ఆమె అన్నారు.

గిరిజనశాఖ మంత్రి పుష్ప శ్రీవాణి
గిరిజనశాఖ మంత్రి పుష్ప శ్రీవాణి
author img

By

Published : Aug 9, 2021, 5:52 PM IST

గిరిజనశాఖ మంత్రి పుష్ప శ్రీవాణి

గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ఆదివాసి దినోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ సూర్యకుమారి, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, ఉప కలెక్టర్ భావన, ఎమ్మెల్యే జోగారావు తదితరులు మంత్రికి స్వాగతం పలికారు.

అడవి తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి పుష్ప శ్రీవాణి... విద్యార్థినులతో కలిసి థింసా నృత్యం చేశారు. సాగు పట్టాలు, యంత్ర పరికరాలు, సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను అందజేశారు.

ఇదీ చదవండి:

Mansas Trust: హైకోర్టులో ఊర్మిళ గజపతిరాజు పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.