ETV Bharat / state

ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధులు.. ఎన్‌వైకే బృందాలు

యువతలో నైపుణ్యాలు పెంచాలి.. నాయకత్వ లక్షణాలు అలవర్చాలి. భావితరాలకు స్ఫూర్తిగా తీర్చిదిద్దాలి.. బాధ్యత గల పౌరులుగా తయారు చేయాలి.. ఇందుకోసం నెహ్రూ యువ కేంద్రం (ఎన్‌వైకే) ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రత్యేకంగా యువ దళాలు ఏర్పాటు చేసి వారిని సమాజంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఈ దళాల బాధ్యతలు ఏంటి.. ఏం చేయాల్సి ఉంటుంది.. తదితర అంశాలపై విజయనగరం నుంచి ప్రత్యేక కథనం.

nyk groups
నెహ్రూ యువ కేంద్రం బృందాల ఏర్పాటుకు కసరత్తు
author img

By

Published : Oct 12, 2020, 7:29 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. దీంతోపాటు అన్ని వర్గాల ప్రజలకు కొన్ని హక్కులు, విధులు, విధానాలు పొందుపర్చి ఉంటాయి. వీటిని ఎలా వినియోగించుకోవాలో చాలామందికి తెలియదు. ఇందుకోసం ఎవరో ఒకరిపై ఆధారపడుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతలను గుర్తు చేసేలా యువదళాన్ని తయారు చేయనున్నారు. వీరు క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలను చైతన్యపర్చడం, వారికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజల్లో అవగాహన వచ్చి జవాబుదారీతనం పెరుగుతుందని యంత్రాంగం భావిస్తుంది. ఇందులో భాగంగా 15 నుంచి 35 ఏళ్లలోపు యువతీయువకులు జిల్లాలో ఎంత మంది ఉన్నారు..? వారి చదువులు, వృత్తి తదితర వివరాలు సేకరించే పని మొదలు పెట్టారు.

సమాచార కేంద్రాలుగా..

మండలంలో ఉండే ప్రతి ఎంపీడీవో కార్యాలయంలో యువత వృత్తి, నైపుణ్య తదితర అంశాలకు సంబంధించిన సమాచారం లభించేలా తగిన ఏర్పాట్లు చేయనున్నారు. వీటిని యూత్‌ రిసోర్స్‌ కేంద్రాలుగా పిలుస్తారు. జీవనోపాధికి సంబంధించిన ప్రతీ అంశానికి సమాధానం ఇక్కడ లభించేలా చేస్తామని ఎన్‌వైకే ప్రతినిధులు చెబుతున్నారు. ఆసక్తి గలవారు ఎన్‌వైకే కార్యాలయంలో సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారని జిల్లా సమన్వయకర్త జి.విక్రమాదిత్య తెలిపారు.

పనితీరుపై చర్చ..

కేవలం సంఘం పెట్టి వదిలేయకుండా ఆయా ప్రాంతాల్లో జరిగే వివిధ సభలలో మాట్లాడే అవకాశాన్ని సదరు యువజన సంఘం నిర్వాహకులకు ఇవ్వనున్నారు. గ్రామ, పట్టణ, విద్య, వైద్య వివిధ విభాగాల అభివృద్ధి కమిటీల పనితీరుపై చర్చించొచ్చు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే వివిధ సదస్సులలో మాట్లాడే అవకాశాలను సైతం అందుకోవచ్చు.

ఏర్పాటు ఇలా..

జిల్లాలో 960 గ్రామ పంచాయతీలు ఉండగా, పంచాయతీకి రెండు యువజన సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. 664 గ్రామ, 114 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయ పరిధిలో ఒక్కొక్క యువజన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్రం పరిధిలో 250 మంది యువజన సంఘాలు రిజిస్ట్రేషన్‌ అయ్యి ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా మరో 50 వేల వరకు సంఘాలను ఏర్పాటు చేయాలని ఎన్‌వైకే ఆలోచిస్తోంది.

అర్హతలు ఇవీ..

20 మందితో యువజన సంఘంగా ఏర్పాటు చేసుకోవచ్చు. సభ్యులు 15 నుంచి 35 ఏళ్ల లోపు వారై ఉండాలి. స్థానికంగా నివాసం ఉండాలి. రూ.630తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఇదీ చదవండి:

మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.