విజయనగరం జిల్లా పార్వతీపురంలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు యం.కృష్ణమూర్తి ఆరోపించారు. రాష్ట్రానికి, దళితులకు, గిరిజనులకు ద్రోహం చేసే భాజపాతో... వైకాపా, తెదేపా, జనసేన ఎందుకు రాజీ పడుతున్నాయని ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సుందరయ్య భవన్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా సాగారు.
ఇదీ చదవండి