విజయనగరంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం టెస్టులు చేయడం లేదని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. ఎల్బీజీ భవన్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లోని వారికి మాత్రమే కొవిడ్ 19 టెస్టులు చేస్తున్నారని అన్నారు. కరోనా నేపథ్యంలో తక్షణమే విద్యుత్ శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో భయందోళనలు తొలగిపోతాయని అన్నారు.. ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కొవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని డిమాండ్ చేస్తూ జూలై 13న కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నామని ఆయన తెలిపారు.