ETV Bharat / state

పెట్రో ధరలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, సీఐటీయూ ఆందోళన - cpi protest in ap latest updates

పెట్రోల్​ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. పెరుగుతున్న ధరలతో పెట్రోల్​ కొనలేని పరిస్థితిలో ఉన్నామని ఆటోలను తాడుతో కట్టి లాక్కెళ్తూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.

cpi leaders protest in ap over petrol rate increasing
మినీ లారీకి తాడు కట్టి లాగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
author img

By

Published : Jun 20, 2020, 4:41 PM IST

విజయనగరం జిల్లాలో..

పెంచిన పెట్రోల్​ ధరలు తగ్గించాలంటూ పార్వతీపురంలో సీపీఐ, సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్​ వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటరమణ అధ్యక్షతన ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆటోను తాడుతో కట్టి లాగుతూ నిరసన తెలిపారు. అంతర్జాతీయ విపణిలో ఇంధన ధరలు తగ్గుతుంటే మన దేశంలో రోజూ రేటును పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని సీఐటీయూ నాయకులు అన్నారు.

విశాఖ జిల్లాలో..

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మరింత భారాన్ని ప్రజలపై వేయడం ప్రభుత్వానికి తగదన్నారు. పెట్రోల్​, డీజిల్​ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు భద్రం, లక్ష్మణ్, శంకర్ రావు, మల్లికార్జున రావు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో..

పెట్రోల్​ ధరలు తగ్గించాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళగిరిలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. మినీ లారీకి తాడు కట్టి లాగారు. కిలోమీటరు మేర లారీని లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలను పెంచి మరింత భారం మోపిందని రామకృష్ణ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే వైఖరిని కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్త బంద్​కి పిలుపునిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.

గుంటూరు జిల్లాలో..

సీపీఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెంచిన పెట్రోల్​, డీజిల్ ధరలను వెంటనే ఉపహసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఏరియా కార్యదర్శి సీఆర్ మోహన్​ ఆటోకి తాడు కట్టి లాగారు.

ఇదీ చదవండి :

పెట్రోడీజిల్​ ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.