ETV Bharat / state

'కరోనా నుంచి కోలుకున్నా... మరిన్ని జాగ్రత్తలు అవసరం' - విజయనగరం జిల్లా ముఖ్య వార్తలు

కరోనా వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ మరికొన్ని రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ సూచించారు. వ్యాధిని ఎదుర్కోవాలంటే మనోధైర్యం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

మందుల ప్యాకెట్​ను అందిస్తున్న కలెక్టర్
మందుల ప్యాకెట్​ను అందిస్తున్న కలెక్టర్
author img

By

Published : May 27, 2021, 7:37 PM IST

కరోనా తగ్గినప్పటికీ కొన్ని రోజులపాటు జాగ్రత్తలు పాటించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ సూచించారు. ఈ మేరకు నెల్లిమర్ల మిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకున్న 22 మందికి కలెక్టర్​తో పాటు మిమ్స్ మెడికల్ నోడల్ ఆఫీసర్ హరికిషన్ సుబ్రహ్మణ్యం వారి వైద్య బృందం వీడ్కోలు పలికింది. వారికి వాహనాలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చికిత్స పొందినప్పటికీ..కనీసం పదిరోజుల పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైనంత వరకు హోంఐసోలేషన్ ఉండాలని తెలిపారు. వ్యాధిని ఎదుర్కొనాలంటే మనోధైర్యం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం బాధితులకు డ్రైప్రూట్స్, అవసరమైన మందులను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.