విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి ఎదుట సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన యువకులు నిరసన తెలిపారు. తమ గ్రామంలో 24 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని... మరో వంద మందికి పరీక్షలు చేసేందుకు రిజిస్టర్ చేశారని వెల్లడించారు. అయినా పరీక్షలు జరపలేదని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికి వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులను క్వారంటైన్ సెంటర్కు తరలించాలని కోరారు.
ఇదీ చదవండి విద్యుదాఘాతంతో యువకుడు మృతి