విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ పర్యటించారు. జగన్ ప్రభుత్వానికి కేసులు పెట్టటం తప్ప మరో పనిలేదన్నారు. ప్రభుత్వం ఏ రోజూ కూడా నిజం చెప్పే పరిస్థితి లేదన్నారు. ఇంటి ముందు ఉన్న చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బొత్సా ఇంటి ముందు చెత్త వేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తామన్నారు. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి, వారి వెనుక ఉన్న వారికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నామన్నారు.
రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు
ఈ నెల 19న రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తామని శైలజానాథ్ తెలిపారు. నిజం మీద, సత్యం మీద బతికే ఒకేఒక్క నాయకుడు రాహుల్ గాంధీ అని పేరొన్నారు. మోడీ, జగన్ వలనే ఈ దుస్థితి పట్టిందన్నారు. జాతీయ ఉపాధి పథకం నుంచి ఒక్క రూపాయి బియ్యం వరకు అన్ని కాంగ్రెస్ తెచ్చినివేనన్నారు. నిత్యవసర సరుకుల నుంచి, పెట్రోల్, డీజిల్ అన్నింటి ధరలు పెంచుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి