ETV Bharat / state

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

author img

By

Published : Oct 4, 2020, 3:48 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసిందేమి లేదని ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ విమర్శించారు.

congress party protest at vizianagaram against agriculture sector bill passed in parliament
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

'సంతకాలు పెట్టండి, అన్యాయాన్ని ఎదుర్కొండి' అంటూ...ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా... విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

కరోనా ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా... ప్రధాని మోదీ,సీఎం జగన్ పట్టించుకునే పరిస్థితి లేదని శైలజానాథ్ విమర్శించారు. భాజపా, వైకాపా రెండూ దొందేనంటూ... బయట ఒకరికి ఒకరు తిట్టుకుని, లోలోపల కలిసి తిరుగుతారని ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ సంస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం గాని రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు.

ఇదీ చదవండి:

రోజుకో దాడి.. పూటకో విధ్వంసం.. ఇదే సీఎం జగన్ పాలన: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.