విజయనగరంజిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేపట్టాలని... విజయనగరంజిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు.
కొవిడ్ వ్యాక్సిన్ నిల్వ, రవాణాలో శీతలీకరణ వ్యవస్థ నిర్వహణే ముఖ్యం . ఇప్పటి నుంచే వ్యాక్సిన్ ప్రదేశాలను గుర్తించడం, రవాణా సమయంలో వ్యాక్సిన్‌కు అవసరమైన స్థాయిలో శీతల వ్యవస్థ ఉండేలా ఆయా వాహనాల్లో ఏర్పాట్లు చేయాలి. తహశీల్దార్‌లు, మండలస్థాయి టాస్కుఫోర్సు సమావేశాలు... నిర్వహించి నివేదికలు వెంటనే పంపించండి. _ కలెక్టర్ హరిజవహర్ లాల్
కొవిడ్ వ్యాక్సిన్ చేపడుతున్న కారణంగా... ఇతర వ్యాధినిరోధక టీకాలకు ఆటంకం లేకుండా చూడాలి . వ్యాక్సిన్ కోసం పలువర్గాల నుంచి వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి అధికంగా ఉంది . కావునా ఈ విషయంలో జాగ్రత్తలు చేపట్టాల్సి చేపట్టాలి. _ సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్
ప్రస్తుతం జిల్లాలో 90 కోల్డ్ చెయిన్ పాయింట్లు, 231 నిల్వ పరికరాలు, 3909 మంది వ్యాక్సినేషన్ చేపట్టే ఎ.ఎన్.ఎం.లు .... అందుబాటులో ఉన్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రమణకుమారి అధికారులకు వివరించారు. వ్యాక్సిన్ రవాణాకు మరో రెండు ప్రత్యేక వాహనాలు, అదనపు నిల్వ పరికరాల సరఫరా కోసం ప్రభుత్వానికి నివేదించామని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలసి మొత్తం 15వేల ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉన్నప్పటికీ... వ్యాక్సినేషన్‌లో శిక్షణ పొందిన కార్యకర్తలు 3,909 మంది మాత్రమే ఉన్నట్టు డీఎంహెచ్ వో తెలియచేశారు.
వ్యాక్సినేషన్‌కు ఇతర శాఖల నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమో గుర్తించి తెలియజేయండి. తద్వారా ఆయా శాఖల సిబ్బందిని ఈ కార్యక్రమానికి వినియోగించే ఏర్పాట్లు చేస్తాము.
:-కలెక్టర్
ఇదీ చదవండీ...ఆదాయంతోపాటు విజ్ఞానం పంచుతున్న అన్నదాత