విజయనగరం జిల్లాలో కరోనా చికిత్స అందుకునే క్రమంలో.. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఐటీయూ ధర్నా చేపట్టింది. కలెక్టరేట్ ముందు ఆందోళన చేసింది. కోవిడ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలంటూ నేతలు నినదించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకల సంఖ్యను పెంచాలని కోరారు.
పరీక్షల ఫలితాలను 24 గంటల్లో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ బాధితులకు వైద్య సేవలు సత్వరం అందేలా… సిబ్బందిని వెంటనే నియమించాలన్నారు. ఆసుపత్రుల్లో కొవిడ్ పడకల లభ్యత, సమాచారం కోసం నోడల్ అధికారులను నియమించి… ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని కోరారు.
ఇదీ చూడండి: