విజయనగరం జిల్లా పార్వతీపురంలో సీఐటీయూ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. 50 సంవత్సరాల ప్రస్థానంలో కార్మికోద్యమ ఐక్యత పై వక్తలు మాట్లాడారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి కే సుబ్బరావమ్మ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐటీయూ ఆవిర్భావం నుంచి చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళిక లక్ష్యాలను వివరించారు. పార్వతీపురం ప్రాంత సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి వేణు, వెంకట్రావు, బీవీ రమణ, జిల్లా ఉపాధ్యక్షులు వీ.ఇందిరా, శ్రామిక మహిళా సంఘం నాయకురాలు బీ. లక్ష్మి ,ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, వివిధ సంఘాల కార్మికులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి.