విజయనగరం జిల్లా కేంద్రంలోని రంజని, శివ రంజని థియేటర్ వద్ద.. 'చావు కబురు చల్లగా' చిత్ర బృందం సందడి చేసింది. మేనేజర్ భాస్కర్, పంపిణీదారులు నర్శింగ్, సిబ్బంది.. వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఇక్కడకు వచ్చినట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ నెల 19న గీత ఆర్ట్స్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమా.. అన్ని వర్గాలనూ అలరిస్తుందని, చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని డైరెక్టర్ పి. కౌశిక్, ప్రముఖ హీరో కార్తికేయ పేర్కొన్నారు. మంచి కథనంతో చిత్రించామని.. బ్యానర్ ప్రతిష్టను పెంచే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదం అందిస్తామనే నమ్మకం ఉందన్నారు. కుటుంబ సమేతంగా సినిమా చూసి తమను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు చేయని కొత్త క్యారెక్టర్ ఈ సినిమాలో చేసినట్లు హీరో కార్తికేయ తెలిపారు. రానున్న రోజుల్లోనూ విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తానన్నారు.
ఇదీ చదవండి: