ETV Bharat / state

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సీఎం.. 3 రాజధానులు కడతారా?: చంద్రబాబు

Chandrababu Slams Heavily Jagan: విజయనగరం జిల్లా బొబ్బిలి బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను జగన్​మోహన్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. జీతాలు సైతం ఇవ్వలేని సీఎం 3 రాజధానులు కడతారా? అంటూ ఎద్దేవా చేశారు.

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Dec 23, 2022, 10:25 PM IST

Updated : Dec 24, 2022, 6:29 AM IST

Chandrababu public meeting in Bobbili: ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జీతాలు సైతం ఇవ్వలేని సీఎం.. 3 రాజధానులు కడతారా? అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ చర్యల వల్ల అమరావతిలో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఫైనాన్షియల్‌, టూరిజం హబ్‌గా మారాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజాం నుంచి టెక్కలి, తెర్లాం, గొల్లపల్లి వరకు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" అంటూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీపై ధ్వజమెత్తారు.

బొబ్బిలి బహిరంగ సభలో చంద్రబాబు

జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను జగన్​మోహన్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తున్నారని.. వారి విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. వైకాపా పాలనలో రైతులు ఆనందంగా లేరంటూ ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదనీ.. వారికి గిట్టుబాటు ధరను కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు పూర్తిగా చితికిపోయారని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దిగజారిపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం సమయంలో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. నాయకత్వంలోనూ మహిళలు పోరాడాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు.

తెలుగువారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. అది తెలంగాణ అయినా.. అమెరికా అయినా.. ఎక్కడైనా తెలుగువారి కోసం నేను అండగా ఉంటాను. తెలుగు వారి కోసమే తెలుగు దేశం పార్టీ పుట్టింది. విశాఖకు వచ్చే పరిశ్రమలు పారిపోయాయి. మూడు రాజధానుల పేరుతో జగన్​మోహన్ రెడ్డి మూడు మక్కలాట ఆడుతున్నారు. విశాఖ ఫైనాన్షియల్‌, టూరిజం హబ్‌గా మారాలని కోరుకుంటూన్నాను. జాబ్ రావాలంటే ఏం కావాలో చెప్పండి. రైతులు పండించిన పంటకు సకాలంలో డబ్బులు అందిస్తున్నారా? రైతు సమస్యలపై నేను ప్రశ్నిస్తా. -చంద్రబాబు, టీడీపీ అధినేత

విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్న జగన్‌ను ఓడించేందుకు.. ప్రజా చైతన్యం అవసరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ బొబ్బిలిపులిలా పోరాడి.. వైసీపీని కూకటివేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు. జగన్ రాజకీయం చేస్తే రాజకీయం చేస్తా.. దోపిడీ చేస్తే ఆయన గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు.

ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సొంత ఛానల్‌లో అసత్యాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రిని ఓడించడానికి... ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బొబ్బిలిపులిలా గర్జించాలన్నారు. వెళ్లిన ప్రతి ప్రాంతంలో అద్భుత ప్రజాభిమానం కనిపిస్తోందని... ఈ స్పందన చూస్తుంటే వైకాపాకు ఈసారి ఒక్క సీటు కూడా రాదనిపిస్తోందని అన్నారు.

పోలీసుల మెడపై కత్తి పెట్టి ప్రతిపక్షాలపై జగన్‌ కేసులు పెట్టిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసులు ఇప్పటికైనా కళ్లు తెరిచి న్యాయబద్ధంగా పనిచేయాలన్నారు. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధిని నాశనం చేసిన జగన్‌.. పథకాలన్నింటినీ నీరుగార్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలను విపరీతంగా పెంచేసి, పేదవారి పొట్టగొట్టారని మండిపడ్డారు. ప్రపంచంలో చెత్తపై పన్ను వేసిన సీఎం జగన్‌... ఓ చెత్త ముఖ్యమంత్రిగా మిలిగిపోయారని వ్యాఖ్యానించారు.

సర్వేల పేరుతో వైకాపా నేతలు భూములు దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. దోపిడీలో ఆరితేరిన జగన్‌కు అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

అంతకుముందు బొబ్బిలిలో ర్యాలీ నిర్వహించిన చంద్రబాబుకు అడుగడునా జనం బ్రహ్మరథం పట్టారు. మహిళలు రోడ్డు మీదికి వచ్చి అభివాదం చేశారు. తెర్లాంలో జన స్పందన చూసిన చంద్రబాబు... అక్కడ కాసేపు ఆగి ప్రసంగించారు. బాడంగిలో అరటి వ్యాపారి కష్టాలు తెలుసుకున్న ఆయన... తోపుడు బండిపై ఉన్న పళ్లు కొనుగోలు చేసి ప్రజలకు పంచారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 24, 2022, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.