విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస ప్రాంతంలో విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాన్ని కేంద్ర గిరజన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ కట్టమణి, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర పరిశీలించారు. అక్కడ కల్పిస్తోన్న వసతులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేటాయించిన స్థలానికి అదనంగా మరో వంద ఎకరాలు కేటాయించాలని, జాతీయ రహదారికి ఆనుకొని ఆ ప్రాంతానికి వెళ్లేమార్గంలో అదనంగా మరో ఏభై ఎకరాలు కేటాయిస్తే మహిళలకు వసతి గృహం, ఆసుపత్రి, క్రీడామైదానం, గ్రంథాలయం వంటివి నిర్మించుకోనేందుకు వీలుగా ఉంటుందని వీసి అన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు అయితే ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. వారి వెంట సీటీవీ సన్ రాజు, జేసీ కిషోర్ కుమార్, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, ఆర్డీవో భవానీశంకర్, సాలూరు గజపతినగరం ఎమ్మెల్యేలు పి.రాజన్నదొర, బి. అప్పలనర్శయ్య పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఇదీ చదవండి: రామతీర్ధంలో భాజపా, జనసేన నేతలు అరెస్టు