రాష్ట్రంలో విజయనగరం-టిట్లాఘర్ మూడో రైల్వే లైను ప్రాజెక్టు సహా నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గంతో పాటు కడప-బెంగుళూరు నూతన రైలు మార్గాలకు సంబంధించి భూమి అప్పగింతకు మూడు నెలల గడువు కావాలని ఏపీ కోరింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే కొంత భూమిని అప్పగించామని మిగతా ల్యాండ్ పార్శిళ్లను అప్పగించేందుకు కొంత సమయం పడుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు.
దిల్లీ నుంచి కేంద్ర మంత్రులు మనీష్ మాండవీయ, జితేంద్ర సింగ్‌లు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా రెవెన్యూ, రహదారులు భవనాల శాఖ అధికారులు హాజరయ్యారు. ప్రగతి ప్రాజెక్టులను స్వయంగా ప్రధానమంత్రి పర్యవేక్షిస్తున్నందున వేగంగా ఈ ప్రాజెక్టుల పూర్తికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రులు కోరారు. ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమిని సేకరించి ఇచ్చేందుకు ఆయా భూమి యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సీఎస్ తెలిపారు. కొవ్వూరు-భద్రాచలం రోడ్ నూతన రైల్వే లైను నిర్మాణ ప్రాజెక్టు.. రాష్ట్ర విభజన అంశంలో ఉందని ఆప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు.
ఇదీ చదవండి