సంతోషంగా అమ్మమ్మ ఇంట్లో గడుపుదామని వెళ్లిన బాలుడిని విద్యుత్తు తీగలు కబళించాయి. విజయనగరంజిల్లా చీపురుపల్లి మండలం ఎలకలపేటలో ఈ విషాద ఘటన జరిగింది. చీపురుపల్లి మండలం పుర్రేయవలసకు చెందిన ఈశ్వరరావు కుమారుడు సురేంద్ర వేసవి సెలవులకు తన తాతగారి గ్రామం ఎలకలపేటకు వచ్చాడు. మధ్యాహ్నం తన స్నేహితులతో కలసి సమీపంలోని అరటితోటలోకి వెళ్లాడు. మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్తు తీగలను గమనించకుండా బాలుడు ముందుకు వెళ్లాడు. తీగల్లో విద్యుత్ సరఫరా అయిన కారణంగా బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనలో మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది కూడా చదవండి.