ETV Bharat / state

గంజాయి అక్రమ రవాణా.. ఆరుగురు అరెస్టు - cannabis trafficking in vizianagaram news

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో గురువారం మూడు వేరు వేరు చోట్ల జరిగిన దాడుల్లో 23 కిలోల గంజాయి పట్టుకున్నారు.

cannabis trafficking at vizianagaram
గంజాయి పట్టివేత
author img

By

Published : Jun 19, 2020, 8:24 AM IST

విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్​ నుంచి విశాఖ వెళ్లే బస్సులో ఓ మైనర్ బాలుడు నుంచి ఏడు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ఆపకుండా వేగంగా వెళ్ళిపోతూ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వెంబడించి కారులో తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న విశాఖ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్​ చేశారు.

ఇదే చెక్​పోస్ట్​ వద్ద అరకు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు నాలుగు కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మొత్తంగా మూడు కేసుల్లో 23 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్న పోలీసులు.. మైనర్ బాలుడితో సహా ఆరుగురిని రిమాండ్​కు తరలించారు. మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇవీ చూడండి...

పాఠశాలలో సచివాలయ నిర్మాణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.