ETV Bharat / state

ఆ మాట చెప్పడానికి.. యనమల ఎవరు?: బొత్స - Botsa satyanarayana

కృష్ణానది కరకట్టపై లింగమనేని రమేష్ అక్రమంగా భవనాన్ని నిర్మించినందుకే నోటీసులు ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష, ద్వేషం లేదని విజయనగరంలో స్పష్టం చేశారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jun 28, 2019, 9:10 PM IST

Updated : Jun 29, 2019, 12:00 AM IST

మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసానికి నోటిసుల జారీ గురించి మాజీ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. మంచి పరిపాలన కోసం చర్యలు తీసుకుంటుంటే... ప్రతిపక్షం ఆరోపణలు చేయడం తగదన్నారు. లూటీకి, అక్రమాలకు తావుండకూడదనే ఈ చర్యలు చేపట్టామన్న బొత్స... కరకట్టపై అక్రమ నిర్మాణాలు చేసిన ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఉంటున్న భవనం సీఆర్డీఏ పరిధిలో లేదని చెప్పడాని యనమల ఎవరని బొత్స ప్రశ్నించారు.

ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూపోతుందని... మాజీ సీఎం అయినా... సామాన్యుడైనా ప్రభుత్వానికి ఒక్కటేనని బొత్స పేర్కొన్నారు. విద్యుత్తు ‍ఒప్పందాలపై నారా లోకేష్ ట్వీట్​పై కూడా బొత్స స్పందించారు. విద్యుత్ ఒప్పందాల సమీక్షలో రాష్ట్రానికి నష్టం జరిగినట్లు గుర్తించామని... దానిపై విచారణ చేస్తామని చెప్పారు. లోకేష్, చంద్రబాబు కనుసన్నలలోనే విద్యుత్ ‍‍ఒప్పందాలు జరిగాయన్న మంత్రి... ఏ మేరకు దోపిడి జరిగిందో వారికి తెలియని విషయమా అని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండీ...

రాజన్నరాజ్యంలో ఎమ్మెల్యేలు ఇలాగే బెదిరిస్తారా..? లోకేష్

Intro:ATP:- సర్వజనని వ్యాధి నిరోధకానికి సంబంధించిన టి డి వ్యాక్సిన్ టీకాను అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిల్ కుమార్ విడుదల చేశారు. అనంతపురంలోని డి ఎం హెచ్ వో కార్యాలయంలో టీడీ తికాను విడుదల చేసి ఆయన మీడియాతో మాట్లాడారు. డిఫ్తీరియా, కంఠసర్పి వ్యాధులకు సంబంధించి ఈ టీకా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

Body:కౌమారదశలో ఉన్న 10 నుంచి పదహారేళ్ళ వయసు గలవారు ఈ టీకాను ఉపయోగించవచ్చునని అలాగే మహిళలు కూడా ఈ టీకాలు వినియోగించడం వల్ల కంఠసర్పి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయన్నారు. ప్రతి సంవత్సరం అం ప్రజలకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

బైట్ ....అనిల్ కుమార్, డి ఎం హెచ్ ఓ అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
Last Updated : Jun 29, 2019, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.