ETV Bharat / state

ఎంపీపీ పదవి కోసం ఇరువర్గాల పోటీ.. జోరుగా మంతనాలు - MPp seat in saluru vizianagaram district news update

ఎంపీపీ పదవి తమ వర్గానికే ఇవ్వాలని పలువురు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు కోరారు. మామిడిపల్లి, మరిపల్లి, తోణం, కురుకుటి గ్రామాల నాయకులు, ప్రజలు సమావేశం నిర్వహించారు. ఈసారి పదవిని తమ బెల్ట్​కు చెందిన మహిళకు కేటాయించాలని కోరారు.

Both parties are in talks for the MPp seat
ఎంపీపీ పదవి కోసం ఇరువర్గాల వారు పోటాపోటీ
author img

By

Published : Apr 27, 2021, 2:23 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పరిధిలో ఉన్న ఎంపీపీ పదవిని తమ బెల్ట్​లో ఉన్నవారికి ఇవ్వాలని మామిడిపల్లి, మరిపల్లి, తోణం, కురుకుటి గ్రామాలకు చెందిన పలువురు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు కోరారు. ఆ గ్రామ నాయకులు, ప్రజలు సమావేశమై ఈ మేరకు డిమాండ్​ చేశారు. మండలంలో నాలుగు పర్యాయాలు బట్టి భాగువలస వైపు ఉన్నవారికే జడ్పీటీసీ ఎంపీపీ పదవులు ఇస్తున్నారని.. ఈసారి కూడా వారికే పదవులు ఇవ్వటం సరికాదన్నారు. ఆలోచించి అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరారు. అహర్నిశలు శ్రమించి తమ అభ్యర్థులను గెలిపించుకుంటే.. తమ కష్టాన్ని గుర్తించడం లేదని వాపోయారు.

ఈసారి ఎంపీపీ పదవి ఎస్టీకి రిజర్వేషన్ కావటంతో... మహిళకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కురుకూటి సాంబమూర్తి, సారిక సువార్త రావు, మరుపల్లి జన్ని సీతారాం పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

విజయనగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యం..లాక్​డౌన్​ను తలపిస్తున్న పరిస్థితి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.