పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న సరకులను నిర్ణీత సమయానికి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ డీలర్లు పనిచేస్తున్నారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల సరకుల పంపిణీలో జాప్యం జరుగుతుంది. రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి ప్రజలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రజలకు రేషన్ సరకులు అందిస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల సిగ్నల్ లోపించడంతో డీలర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి గంటల తరబడి సర్వర్ పనిచేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో బుధవారం ఉదయం నుంచి సిగ్నల్ రాకపోవడంతో... డీలర్లు కూర్చీ పాట్లు పడ్డారు. కూర్చీలు ఎక్కి సిగ్నల్ కోసం ప్రయత్నించారు.
ఇదీ చదవండి : 'రెడ్ క్రాస్... కరోనా నివారణ చర్యలు ప్రశంసనీయం'