18వ శతాబ్దం మధ్యలో బొబ్బిలి జమీందారు రాజా గోపాలకృష్ణ రంగారావుకు, విజయనగర సంస్థాన రాజు పూసపాటి పెద విజయరామరాజుకూ వైరం ఉండేది. ఫ్రెంచ్ కమాండర్ ఇన్ చీఫ్ బుస్సీ సాయంతో బొబ్బిలి సైన్యాన్ని.. విజయనగర సైన్యం ఢీ కొట్టింది. అదే బొబ్బిలి యుద్ధం. చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా దీనికున్న ప్రత్యేకతే వేరు. తాండ్ర పాపారాయుడు ప్రతాపానికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచింది. అందుకే నేటికీ దీన్ని వివిధ కళారూపాల్లో ప్రదర్శిస్తుంటారు. బొబ్బిలి రాజ వంశీయుల మ‌్యూజియంలో అలనాటి యుద్ధసామాగ్రి ఆకట్టుకుంటోంది.
1757లో బొబ్బిలి యుద్ధ సమయంలో ఉపయోగించిన కత్తులు తుపాకులు, ఇతర ఆయుధాలు సహా దుస్తులు, సింహాసనాలు పల్లకీలను కోటలో ప్రత్యేకంగా నిర్మించిన మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అతి ఖరీదైన కిరీటాలు వేటాడిన పెద్ద పులుల చర్మాలు వంటి ఎన్నో చారిత్రక విశేషాలు కోటలోని దర్బార్ మహల్‌లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో కొలువుదీరాయి.
రాబోయే తరాలకు బొబ్బిలి యుద్ధం విశిష్టత తెలవాలనే ఉద్దేశంతో ఈ దర్బర్ మహాల్లో మ్యూజియం ఏర్పాటు చేశారు. 1757 యుద్ధ సమాచారంతో పాటు వారి సాంప్రదాయాలు, వారు ఉపయోగించిన ఆయుధాలు, వారు చేసిన సేవ కార్యక్రమాలు మ్యూజియం ద్వారా తెలియజేస్తున్నాం.
రాబోయే తరాలకు బొబ్బిలి యుద్ధం విశిష్టత తెలియాలనే ఉద్దేశంతో ఈ దర్బార్ మహాల్లో మ్యూజియం ఏర్పాటు చేశారు. 1757 యుద్ధ సమాచారంతో పాటు వారి సాంప్రదాయాలు, వారు ఉపయోగించిన ఆయుధాలు, వారు చేసిన సేవ కార్యక్రమాలు మ్యూజియం ద్వారా తెలియజేస్తున్నాం. -విశ్వేశ్వరరావు, మ్యూజియం గైడ్
బొబ్బిలి రాజ వంశీయులు వినియోగించిన అరుదైన కార్లనూ కోట ప్రాంగణంలో ప్రదర్శనకు పెట్టారు. ఈ పురాతన కార్లు చూపరులను ఆకర్షిస్తున్నాయి. బొబ్బిలి రాజ వంశీయులు వినియోగించిన అరుదైన కార్లనూ... కోట ప్రాంగణంలో ప్రదర్శనకు పెట్టారు. ఈ పురాతన కార్లు చూపరులను ఆకర్షిస్తున్నాయి.