ETV Bharat / state

ఓ వైపు విద్యుత్ ఆదా.. మరోవైపు మిద్దె సోలార్.. భళా బొబ్బిలి!

విద్యుత్ పొదుపులో విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది. సౌర విద్యుత్ వినియోగంతో బంగారు పతకాన్ని అందుకుంది. ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, విద్యుత్ శాఖాధికారులు సమష్టిగా నిర్వహించిన విద్యుత్ ఆదా సర్వేలో బొబ్బిలి మున్సిపాలిటీకి ఈ గుర్తింపు లభించింది. వ్యర్థాల శుద్ధి, చెత్తతో ఎరువు తయారీ, ప్లాస్టిక్ నిషేధంలోనూ దేశంలోనే బొబ్బిలికి ప్రత్యేక గుర్తింపు సాధించింది

bobbili-muncipality-people-got-best-award-for-save-power
ఓ వైపు విద్యుత్ ఆదా.. మరోవైపు మిద్దె సోలార్.. భళా బొబ్బిలి!
author img

By

Published : Dec 20, 2021, 1:58 PM IST

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం విద్యుత్ ఆదాలో సత్తా చాటింది. విద్యుత్తు బిల్లుల భారాన్ని తప్పించుకొనేందుకు ఇక్కడ మిద్దె సోలార్ విధానాన్ని పాటిస్తున్నారు. పురపాలక సంఘ కార్యాలయంపై సోలార్ పలకలు ఏర్పాటు చేసి మూడేళ్లలో 14వేల 687 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. తద్వారా 2లక్షల 37 వేల రూపాయల విద్యుత్తు బిల్లు ఆదా అయింది. చెత్తశుద్ధి పార్కులో బయోగ్యాస్ నుంచి మూడేళ్లలో 6.821 యూనిట్లు ఉత్పత్తి చేసి లక్షా 24వేలు మిగిల్చారు. అలాగే తాగునీటి లీకులను అరికట్టి... మోటార్లు పనిచేసే సమయాన్ని తగ్గించారు. 57 వేల 819 యూనిట్ల విద్యుత్తు ఆదా చేసి.. 5 లక్షల 75 వేల రూపాయలు మిగిల్చారు. మొత్తంగా మూడేళ్లలో 79.457 యూనిట్ల ఆదాతో 9లక్షల36వేల151 రూపాయలు మిగులు చూపించారు. పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్తు పొదుపు సదస్సుల ద్వారా పురపాలక సంఘం పాలకవర్గం అవగాహన కల్పిస్తోంది.

టోటల్ నూటా పది మున్సిపాలిటీల్లో ఈ ఎనర్జీకి సంబంధించి సాంప్రదాయేతర పవర్​ని ఉత్పత్తి చేసి పవర్​ను ఆదా చేయడంలో గానీ టోటల్ 110 మున్సిపాలిటీల్లో కూడా అత్యంత ప్రతిభ కనబర్చిన ఆఫీసుగా బొబ్బిలికి బంగారు పతకాన్ని కేటాయించడం జరిగింది. మనం ఆఫీసు నుంచి ఎంతైతే ఎనర్జీని మున్సిపాలిటీ ద్వారా ఎనర్జీ డిపార్ట్​మెంట్​కి ఇస్తున్నామో... అంత దాన్ని యూనిట్లని రేట్లలో కన్వర్ట్ చేసి, దాన్ని సేవింగ్ కింద మాకు చూపించి.. మా పవర్ బిల్లులో దాన్ని చూపించి మాకు పవర్ బిల్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటుగా బొబ్బిలికి సంబంధించి వస్తున్న తడి చెత్త, పొడి చెత్తలకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడైతే ఉందో ఆ యూనిట్ దగ్గర చిన్న బయోగ్యాస్ ప్లాంట్​ను కూడా మేం ఏర్పాటు చేయడం జరిగింది.

- శ్రీనివాసరావు, బొబ్బిలి పురపాలక కమిషనర్

వ్యర్థాల శుద్ధి, చెత్తతో ఎరువు తయారీ, ప్లాస్టిక్ నిషేధంలోనూ దేశంలోనే బొబ్బిలికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నెల 6న నీతి అయోగ్ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. పండ్లు, కూరగాయలు, కోళ్లు, చేపలు, పూల వ్యర్ధాలు, పార్కుల నిర్వహణ, తడి, పొడి చెత్తను ఎరువుగా మార్చి విక్రయించి ఆదాయం సంపాందించటంలోనూ ముందు వరుసలో నిలిచింది. తడి చెత్త నుంచి వచ్చే వ్యర్థాలతో బయోగ్యాస్​ను తయారు చేస్తున్నారు. ఇళ్లల్లో మురుగు శుద్ధికి ఇటీవల ప్రత్యేక పార్కు నిర్మించారు. 12 ఏళ్లుగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రత్యేక కృషి జరుగుతోంది. బొబ్బిలి పురపాలకలో నీటి ప్యాకెట్ల వినియోగం, తయారీని నిషేధించారు. ప్లాస్టిక్ సంచులు, గ్లాసుల విక్రయంపై అపరాధ రుసుము విధిస్తున్నారు. కాగితపు సంచులను మాత్రమే వాడాలని నిబంధన విధించారు.

మా అధికారులు మరియు మా కౌన్సిల్ సభ్యులు కో ఆర్డినేషన్​తో ఏదైతే... సోలార్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ.. దాన్ని కూడా శుభ్రంగా మేయింటెన్ చేస్తూ.. ఆ రకంగా మా మున్సిపాలిటీకి విద్యుత్ ఆదా జరుగుతోంది. అందులో భాగంగా రెండు మూడు స్కూళ్లలో కూడా ఆ రకమైనటువంటి వెసులుబాటు ఉన్నది. తద్వారా కూడా విద్యుత్ ఆదా అవుతోంది. అదే కాకుండా మా మున్సిపాల్ డంపింగ్ యార్డు దగ్గర బయోగ్యాస్ ఉంది. దాని ద్వారా కూడా డంపింగ్ యార్డులో బయోగ్యాస్ ద్వారా తయారు చేసి... వంటకు కావాల్సిన గ్యాస్ కూడా తయారు చేస్తున్నాం.

- మురళీ కృష్ణారావు, బొబ్బిలి పురపాలక ఛైర్మన్

ప్రజా చైతన్యం ద్వారా ఫలితాలు రాబట్టవచ్చని నిరూపిస్తున్న బొబ్బిలి పురపాలక సంఘం.... ఇతర మున్సిపాల్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఓ వైపు విద్యుత్ ఆదా.. మరోవైపు మిద్దె సోలార్.. భళా బొబ్బిలి!

ఇదీ చూడండి:

ARUDROTHSAVALU: ఘనంగా ఆరుద్రోత్సవాలు.. శివయ్యకు అన్నాభిషేకాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.