విజయనగరం జిల్లా భోగాపురం మండలం తీరప్రాంత గ్రామం చేపలకంచేరులో ఆదివారం మధ్యాహ్నం పడవ బోల్తా పడింది. శనివారం సాయంత్రం వేటకు వెళ్లి.. ఆదివారం తిరిగి వస్తుండగా సముద్రపు అలల ధాటికి బోటు బోల్తా పడింది. పడవలో ఉన్న మత్స్యకారుడు మైలపల్లి రాముకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అవుతున్న రామును సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.
ఇదీ చదవండి : MINISTER BOTSA: 'మంత్రివర్గ విస్తరణపై సీఎంకు పూర్తి స్వేచ్ఛ ఉంది'