విజయనగరం 21వ డివిజన్ కార్పొరేటర్ భాజపా అభ్యర్థి కాళ్ల నారాయణరావుపై హత్యాయత్నం... ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రోద్బలంతోనే జరిగిందని భాజపా, జనసేన నేతలు ఆరోపించారు. ప్రశాంతమైన విజయనగరంలో భాజపా కార్పొరేటర్ అభ్యర్థిపై హత్యాయత్నం జరగటం రాష్ట్రంలో నెలకొన్న హత్యా రాజకీయాలకు నిదర్శనమని భాజపా యువ మోర్చా నాయకులు సురేంద్ర మోహన్ అన్నారు.
ఈ ఘటనలో ఎమ్మెల్యే కోలగట్ల ప్రోద్బలం ఉందని స్పష్టం చేశారు. హత్యాయత్నంలో పాల్గొన్న నిందితుల అరెస్టులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
భాజపా - జనసేన కార్పొరేటర్ అభ్యర్థిపై దాడి కేసులో ఐదుగురి అరెస్ట్