విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి... నిత్యావసర సరకులు, బియ్యం అందించి తన ఉదారతను చాటుకున్నారు భాజపా నేత సురగాల ఉమామహేశ్వరరావు. పురపాలక కార్యాలయం వద్ద కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. ఏమిచ్చినా కార్మికుల రుణం తీరనిదని పేర్కొన్నారు. పురపాలక కమిషనర్ కనకమహాలక్ష్మి మాట్లాడుతూ... కరోనాపై చేస్తున్న పోరాటంలో పారిశుద్ధ్య కార్మికులు వీర సైనికులుగా ముందుకు కదులుతున్నారని కొనియాడారు. దాతలు అందించిన సహకారం కార్మికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.
ఇదీ చదవండీ... వంట సరకులతో 3 కి.మీ నడిచిన కలెక్టర్, ఎమ్మెల్యే