విజయనగరం జిల్లాను క్షయ వ్యాధి రహితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. జాతీయ క్షయ నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. క్షయవ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, వ్యాధిగ్రస్తులకు మంచి చికిత్సను అందించి, దానినుంచి విముక్తులను చేయాలని కలెక్టర్ సూచించారు.
క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. టీబీ ఓడిపోతుంది... దేశం గెలుస్తుంది... అన్న నినాదంతో జరిగిన ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వరకూ సాగింది. 2025 నాటికి దేశం నుంచి క్షయను పూర్తిగా తరిమి వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. క్షయ లక్షణాలు కనిపిస్తే, వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షలను నిర్వహించుకోవాలని సూచించారు.
టీబీ హారేగా -దేష్ జీతేగా...
టీబీ లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్ష చేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించాలన్నదే లక్ష్యమన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనకు 2025 నినాదంతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీబీ హారేగా - దేష్ జీతేగా పేరుతో రూపొందించిన పాటను ఆయనతో పాటు ఆ శాఖ అధికారులు ఆవిష్కరించారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా 2025 నాటికి టీబీని పూర్తిగా నివారించేదుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
అనకాపల్లిలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ
టీబీ ఓడిపోతుంది దేశం గెలుచుకుంది అంటూ క్షయ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి పట్ల అవగాహన పెంచుకొని ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అనకాపల్లి పట్టణ పురవీధుల్లో క్షయ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వైద్య సిబ్బంది ప్రదర్శన జరిపారు.
ఇవీ చదవండి: