ETV Bharat / state

12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిన అరబిందో ఫార్మా ఫౌండేషన్

కొవిడ్​ బాధితులను ఆదుకునేందుకు పైడిభీమవరానికి చెందిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. సుమారు 15 లక్షల విలువైన 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 2500 శానిటైజర్ బాటిళ్లను విజయనగరం జిల్లా కలెక్టర్​కు అందజేసింది.

12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కలెక్టర్​కు అందజేసిన అరబిందో ఫార్మా ఫౌండేషన్

author img

By

Published : May 20, 2021, 4:51 PM IST

ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కొవిడ్ బాధితుల‌ను ఆదుకోవ‌డానికి ముందుకు వ‌చ్చిన అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్‌ను విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అభినందించారు. ఇది ఒక సామాజిక బాధ్య‌త‌గా భావించి, మ‌రిన్ని సంస్థ‌లు ముందుకు రావాల‌ని ఆయ‌న కోరారు. సుమారు రూ.15 ల‌క్ష‌లు విలువైన 12 ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్లు, 2500 శానిటైజ‌ర్ (200 మి.లీ) బాటిళ్లను పైడిభీమ‌వ‌రానికి చెందిన అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్‌... జిల్లా క‌లెక్ట‌ర్‌కు క‌లెక్ట‌రేట్‌వ‌ద్ద‌ అంద‌జేసింది.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ.... ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్ల అవ‌స‌రం చాలా ఉంద‌న్నారు. ఒక్కొక్క‌టి సుమారు రూ.80వేలు విలువైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్లను అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్‌ అంద‌జేసింద‌ని, వాటిని ఎస్‌కోట‌, పార్వ‌తీపురం త‌దిత‌ర అవ‌స‌ర‌మైన ఆసుప‌త్రుల‌కు పంపిస్తామ‌ని తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డి చేసేందుకు జిల్లా యంత్రాగం ప‌టిష్ట‌మైన వ్యూహాన్ని అమ‌లు చేస్తోందని, దీనిలో భాగంగా గ్రామ‌, వార్డు క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

స‌ర్పంచ్‌, స‌చివాలయ‌ సిబ్బంది, వాలంటీర్లుతో క‌మిటీల‌ను ఏర్పాటు చేశామ‌ని, వీరంతా అక్క‌డి ఎఎన్ఎం, ఆశా వ‌ర్క‌ర్లు, వైద్యాధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని ప‌నిచేస్తార‌ని చెప్పారు. ఈ క‌మిటీల స‌భ్యుల‌కు శానిటైజ‌ర్ల‌ను అంద‌జేస్తామ‌ని చెప్పారు. వారికి కొవిడ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డంతోపాటు, వ్యాక్సినేష‌న్ కూడా పూర్తి చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, అర‌బిందో ఫార్మా సీనియ‌ర్ జీఎం ఎన్ఆర్ రాజారెడ్డి, ఆఫీస‌ర్ పి.గోపాల‌కృష్ణారెడ్డి, శంక‌ర్ తోపాటు బి.గ‌ణేష్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఏపీ డెయిరీ ఆస్తుల వ్యవహారం: 'జీవో నెం.117 రాజ్యాంగ విరుద్దం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.